1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. Sambasiva Rao is TTD EO

బాధ్యతలు స్వీకరించిన ఈవో సాంబశివరావు

Sambasiva Rao
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా నియమితులైన సాంబశివరావు బుధవారం మధ్యాహ్నం శ్రీవారి సన్నిధిలో బాధ్యతలు స్వీకరించారు. అంతకు నడక దారిన తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. దర్శనానంతరం రంగనాయకమండపంలో ఆశీర్వచనం తీసుకున్న ఆయన బదిలీ అయిన ఐఏఎస్ అధికారి ఎంజి గోపాల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. 
 
ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది. అక్కడే స్వామి వారి ధ్వజస్థంబము ఎదట ఉన్న రంగనాయక మండపంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు టీటీడీ తిరుమల జేఈవో శ్రీనివాస రాజు, తదితర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. 
About Writer
PY REDDY