సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By ivr
Last Modified: శుక్రవారం, 15 జులై 2016 (14:18 IST)

సంపద, సౌఖ్యాలు అక్కరలేదు... నాకు నిద్ర కావాలి... నేనేం చేయాలి?

స్వామీజీ... నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను చాలా ధనవంతుడిని. నాకున్నదాంట్లో సగభాగాన్ని దానధర్మాలు చేశాను. మిగిలిన దానితో జీవితం సాఫీగా గడిచిపోతున్నా నాకు నిద్ర మాత్రం పట్టడంలేదు. తృప్తి లేదు. నాకసలు సంపద, సౌఖ్యాలు అవసరం లేదు. కేవలం నిద్ర ఉంట

స్వామీజీ... నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను చాలా ధనవంతుడిని. నాకున్నదాంట్లో సగభాగాన్ని దానధర్మాలు చేశాను. మిగిలిన దానితో జీవితం సాఫీగా గడిచిపోతున్నా నాకు నిద్ర మాత్రం పట్టడంలేదు. తృప్తి లేదు. నాకసలు సంపద, సౌఖ్యాలు అవసరం లేదు. కేవలం నిద్ర ఉంటే చాలు. దీనికి నేనేమి చేయాలో చెప్పండి స్వామీజీ...
 
సంపద అక్కరలేదంటున్నావ్, నిద్ర కావాలంటున్నావ్. అంటే ఇప్పుడు నీకు నిద్రే సంపద అయిందన్నమాట. ఒకసారి ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులను ఈ క్రింది విధంగా ప్రశ్నించాడు. జీవితంలో యదార్థంగా సంభవించగలిగే వస్తువు ఏది కావాలో కోరుకోమని వరమడిగితే, ఏమని అడుగుతావు? అని కొంతమంది కారు కావాలని, కొంతమంది లక్ష రూపాయలనీ, ఇలా మరికొంతమంది తమకేవి ఇష్టమో చెప్పారు. అందుకు అధ్యాపకుడు... ఓరి అభాగ్యులారా... ఎందుకు వీటిని కోరుకున్నారు? బుర్రలిమ్మని, మేధస్సునిమ్మని అడగాలి అని వారికి సూచించాడు. అందుకు బదులుగా ఒక విద్యార్థి లేచి, ఎవరైనా తమ దగ్గర ఏది లేదో అది అడుగుతారు కదా అని అన్నాడు. 
 
కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో కరువైంది నీ సంపద. నిద్ర గొప్ప సంపద. అదే గొప్ప సుఖం. ధ్యానమార్గంలో నిమగ్నమైన వారికి ఇది ఒక సమస్య కాదు. ధ్యానంలో నిమగ్నులు కండి. నిద్ర దానంతట అదే వస్తుంది.