తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటలు, కాలినడకన భక్తులకు 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శనివారం దాదాపుగా 60 వేల మంది దర్శనం చేసుకున్నారు. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 42 కంపార్టుమెంట్లు భక్తులతో నిండి పోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.
గదుల వివరాలు:
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
గదుల వివరాలు:
| గదులు | ఖాళీల సంఖ్య |
| ఉచిత గదులు | ఖాళీలు లేవు |
| రూ. 50 గదులు | ఖాళీ లేవు |
| రూ. 100 గదులు | ఖాళీలు లేవు |
| రూ. 500 | ఖాళీ లేవు |
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
| సేవ పేరు | ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య |
| ఆర్జిత బ్రహ్మోత్సవం | 27 |
| సహస్రదీపాలంకరణ సేవ | 101 |
| వసంతోత్సవం | 78 |
