సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By pnr
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (10:17 IST)

హాలీవుడ్‌ దిగ్గజ నటి కన్నుమూత... కుమార్తె చనిపోయిన మరుసటి రోజే

హాలీవుడ్ దిగ్గజ నటి డెబ్బీ రెనాల్డ్స్ కన్నుమూశారు. ఈమెకు వయసు 84 యేళ్లు. కుమార్తె మరణించిన మరుసటి రోజే ఈమె మరణించడం గమనార్హం. కుమార్తె క్యారీ ఫిషర్ మంగళవారం హృదయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మృతిచ

హాలీవుడ్ దిగ్గజ నటి డెబ్బీ రెనాల్డ్స్ కన్నుమూశారు. ఈమెకు వయసు 84 యేళ్లు. కుమార్తె మరణించిన మరుసటి రోజే ఈమె మరణించడం గమనార్హం. కుమార్తె క్యారీ ఫిషర్ మంగళవారం హృదయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈమె కూడా హాలీవుడ్ నటే. ఆ మరుసటి రోజే ఆమె తల్లి.. హాలీవుడ్‌ సీనియర్‌ నటి డెబ్బీ రెనాల్డ్స్‌ మృతిచెందారు. 
 
అయితే కుమార్తె మరణవార్తను తట్టుకోలేక డెబ్బీ రెనాల్డ్స్‌ కుంగిపోయిందని.. ఆ బాధను తట్టుకోలేక ఆమెకు గుండెనొప్పి వచ్చిందని ఆమె కుమారుడు టాడ్‌ ఫిషర్‌ తెలిపారు. దీంతో డెబ్బీని లాస్‌ఏంజిల్స్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. దీంతో హాలీవుడ్ నటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.