గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 19 జులై 2024 (15:27 IST)

వర్షాకాలంలో జలుబు, దగ్గు- లవంగం టీ తాగి చూడండి

Clove Water
వర్షా కాలం రావడంతో సాధారణంగా వచ్చేవాటిలో జలుబు, దగ్గు ముందు వరసలో వుంటాయి. వీటికి లవంగం ఎంతో మేలు చేస్తుంది. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాము.
 
దగ్గుకు సహజమైన మందు లవంగం, శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది. 
లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 
ఆహారం సరిగా జీర్ణం కాకపోయినా, వాంతులు వచ్చినా లవంగాల నూనెను తీసుకుంటే ఉపశమనం ఉంటుంది. 
తేనె, కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. 
వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది. 
తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
తాగే టీలో లవంగం వేసుకొని తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. 
ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.