మధుమేహ వ్యాధికి చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..

శనివారం, 10 నవంబరు 2018 (17:47 IST)
ఆయుర్వేదం ప్రకారం పూర్వకాలం నుండి వచ్చే అనారోగ్య సమస్యలు మధుమేహం, గుండె వ్యాధులు, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులే. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నేటి ఆధునిక జీవితంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం.
 
కఫంలో తేడా ఉంటేనే మధుమేహం వస్తుంది. ఈ సమస్య నుండి బయటపడాలంటే... చక్కెర, పిండి పదార్థాలను తీసుకోవడం మానేసి ముడి బియ్యం, గోధుమ, ఓట్స్ వంటి పదార్థాలను తీసుకోవాలి. మధుమేహం వచ్చిందని తెలియగానే చక్కెరలు, బియ్యం, బంగాళాదుంపలు, బెల్లం, చెరకు, తియ్యని పండ్లు వంటివన్నీ తీసుకోవడం తగ్గించాలి. 
 
బార్లీ గింజలను త్రిఫల కషాయంలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు తేనెతో కలిపి రెండుసార్లు తినాలి. జామపండు మరియు వాటి విత్తనాలు తీసుకుంటే కూడా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. పొడి తీసుకోవచ్చు. తాజా ఆకు కూరలు, పెసలు, సోయాను ఆహారంలో తీసుకోవచ్చు. 
 
మెంతిపొడిని పాలలో వేసుకుని తాగాలి. 15 నుంచి 20 తాజా మామిడాకులు ఒక గ్లాసు నీటిలో మరిగించి, ఆ రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని పరగడుపున తాగాలి. శరీరానికి పొటాషియం, విటమిన్ సి, ఇ, బి కాంప్లెక్సులు ఎక్కువగా చేరేలా ఆహారపదార్థాలు తీసుకోవాలి. 
 
అదేవిధంగా ప్రతి రోజూ ముదిరిన కరివేపాకు ఆకులు సేవించాలి. ఇలా మూడు నెలలపాటు పాటిస్తే... వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం వంటి వ్యాధులు దరిచేరకుండా చేసుకోవచ్చు. మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు పసుపు, కలబంద జిగురులను కలిపి తీసుకుంటే క్లోమం, కాలేయ గ్రంథుల క్రియలు నియంత్రించబడతాయి. కాకరకాయ రసం లేదా నిమ్మరసం తాగినా మేలు కలుగుతుంది.

అన్నీ చూడండి

విజయ్ సీఎం అయినా దిగిపోవాల్సిందే, త్రిష లేకుండా వుంటే విజయ్ జాతకం వేరే: వేణుస్వామి

మా పార్టీ మద్దతు టీవీకే విజయ్‌కు లేదు, ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేసారు: దినకరన్

విజయ్‌కు చుక్కలు చూపిస్తున్న వీసీకే పార్టీ, డిప్యూటీ సీఎం పోస్ట్ డిమాండ్

వామపక్షం అందించారు, ఇక తమిళనాడు సీఎంగా TVK విజయ్

సింహాల గుంపుకు చుక్కలు చూపించిన పాము.. వీడియో వైరల్

అన్నీ చూడండి

Ashu Reddy : చీటింగ్ కేసు టైంలో నిశ్చితార్థం ఫొటోలతో ట్విస్ట్ ఇచ్చిన ఆషు రెడ్డి

Samantha Ruth Prabhu: ది నాడ్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్‌లో సమంత రూత్ ప్రభు

Rowdy Janardhan: ప్రతిభగల దర్శకులందరితో వర్క్ చేయాలనుంది : విజయ్ దేవరకొండ

రాయవలస నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి: కార్తీక్ జయంతి

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ నిర్మించిన రావు బహదూర్ చిత్రం డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments