శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (17:27 IST)

పాదాల పగుళ్లు తొలగించాలంటే.. ఇలా చేయాలి..?

నీళ్లల్లో ఎక్కువగా ఉండడం వలన కూడా పాదాలకు పగుళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ పగుళ్లు తొలగించాలని రకరకలా క్రీములు, మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి లాభాలు కనిపించవు. అందుకు ఇంట్లోని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం.
 
ప్రతిరోజూ నిద్రకు ఉపక్రమించే ముందుగా కాళ్లను శుభ్రంచేసి, పొడిగుడ్డతో తుడుచుకోవాలి. తరువాత పగుళ్లపై కొబ్బరినూనెతో మర్దన చేసుకుని పాదాలను సాక్స్‌లు ధరించాలి. మరునాడు ఉదయాన్నే పాత బ్రష్‌తో పాదాలను రుద్ది గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కొన్ని రోజుల పాటు ఇలా క్రమం తప్పకుండా చేస్తే పాదాలు పగుళ్లు తొలగిపోయి మృదువుగా మారుతాయి.  
 
అరటిపండు గుజ్జును పగుళ్లకు రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ నీటిలో పాదాలు ఉంచాలి. దాంతో పగుళ్ల వలన ఏర్పడే నొప్పులు తొలగిపోతాయి. అలానే రోజ్ వాటర్‍‌లో పాదాలను కాసేపు ఉంచినా కూడా నొప్పి తగ్గుతుంది.  
 
ఒక బకెట్‌ నీటిలో కొద్దిగా వ్యాజ్‌లైన్, నిమ్మరసం వేసి అరగంట పాటు ఆ నీటిలో ఉంచాలి. తర్వాత పొడి వస్త్రంతో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్‌ రాయాలి. ఉదయం ఆవనూనెతో కాళ్లను మర్దనా చేసుకుంటే పగుళ్లు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి. కాళ్లు కోమలంగా, అందంగా ఉండాలంటే.. వీటన్నింటితో పాటు పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. క్యాల్షియం, ఐరన్‌, జింక్‌, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవడం మంచిది.