సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (15:59 IST)

45 యేళ్లు నిండాయా? రోజూ 2 వెల్లుల్లి రెబ్బల్ని పొద్దున్నే తినండి! (video)

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులతో మరణించే వారి సంఖ్య అధికంగా ఉంది. ఆ తర్వాత స్థానంలో కేన్సర్ రోగగ్రస్థులున్నారు. ఈ కేన్సర్ వ్యాధికి సరైన మందును వైద్యులు ఇప్పటికీ కనిపెట్టలేక పోతున్నారు. కేన్సర్ ఎలాగైనా, ఎప్పుడైనా శరీరాన్ని ఎటాక్ చెయ్యొచ్చని చెబుతున్నారు. కానీ అది మన దరికి చేరనివ్వకుండా ఉంచాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే మంచిదని అమెరికా పరిశోధకులు సలహా ఇస్తున్నారు. 
 
ముఖ్యంగా, ప్రతి ఒక్కరి ఇళ్లలో వెల్లుల్లి ఉంటుంది. ఇది 14 రకాల కేన్సర్లను నివారిస్తుంది. మరెన్నో జబ్బులకు నివారణిగా ఉంటుంది. కేన్సర్ రోగులకు రోజుకి కనీసం 5-6 దంచిన పచ్చి వెల్లుల్లి రెమ్మలు ఇవ్వాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఈ రెమ్మలను వెంటనే తినకుండా ఓ 15 నిమిషాలు ఆగాలి. ఈ 15 నిమిషాలలో వెల్లుల్లి రెమ్మల నుంచి ఎలినస్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. 
 
ఇందులో యాంటి ఫంగల్, యాంటి కేన్సర్ తత్వాలు ఉంటాయి. కేన్సర్ మాత్రమే కాదు, తరచుగా వెల్లుల్లి తింటే దాదాపు 166 రకాల జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధకులు అంటున్నారు. వెల్లుల్లి సహజసిద్ధంగా కేన్సర్‌ని నివారిస్తుందని చెబుతున్నారు. కెమికల్స్‌తో కూడిన మెడిసిన్స్ వాడడం కన్నా వెల్లుల్లి ద్వారా కేన్సర్ రాకుండా చూసుకోమని సలహా ఇస్తున్నారు.