కోడెల శివప్రసాద్ చనిపోయాడని సంబరాలు చేసుకున్న భాజపా నేత.. ఎందుకో తెలుసా?
మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ మృతిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చ దారితీస్తోంది. ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ వేధింపులే కారణమని టిడిపి నేతలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆ వ్యాఖ్యలను ఖండించడం లేదు.
అయితే తాజాగా కోడెల మృతి చెందడంపై విజయవాడలో వంగవీటి నరేంద్ర సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని వంగవీటి రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకుని టపాసులు కాల్చారు. జోహార్..జోహార్ రంగా అంటూ నినాదాలు చేశారు. ఏం జరుగుతుందో అర్థం కాక విజయవాడ ప్రజలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
వంగవీటి మోహన రంగను దారుణంగా హత్య చేసిన సమయంలో హోంమంత్రిగా కోడెల శివప్రసాదరావు ఉన్నారట. కుట్రపూరితంగా రంగాను చంపించారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయనే చనిపోయాడు కనుక నాకు చాలా సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు వంగవీటి నరేంద్ర. ప్రస్తుతం వంగవీటి నరేంద్ర బిజెపి పార్టీలో ఉన్నారు.