గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2019 (21:24 IST)

టీటీడీ చైర్మన్ ఇంట్లో అఘోరాలు.. ఎందుకు?

శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసి దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. సామాన్య భక్తులకు పీట వేస్తామని విఐపిలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని వై వి సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఎప్పుడూ వార్తల్లో ఉండే వైవీ మరోసారి అలాంటి పనే చేశారు.
 
ఈసారి ఏకంగా అఘోరాలు టీటీడీ చైర్మన్ ఇంటికి రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వీరంతా నేరుగా హిమాలయాల నుంచి విజయవాడలోని ఆయన ఇంటికి వెళ్లారు. రెండు గంటలపాటు వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో అఘోరాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు అఘోరాల ఆశీస్సులు తీసుకున్నారు. 
 
ధార్మిక సంస్థకు చైర్మన్‌గా ఉన్న సుబ్బారెడ్డి అఘోరాలతో పూజలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు హిందూ ధార్మిక సంఘాలు. శవాల మధ్య గడిపే అఘోరాలతో టిటిడి ఛైర్మన్‌కు ఏం పనో చెప్పాలంటున్నారు.