మంగళవారం, 21 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 ఏప్రియల్ 2022 (23:27 IST)

రోజూ కొన్ని తాజా గులాబీ రేకలను తింటే...?

rose flower
గులాబీ రేకులు శరీరం నుండి మలినాలను క్లియర్ చేయడంతో పాటు జీవక్రియను మెరుగుపరిచే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఈ గులాబీలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. రోజు కొన్ని తాజా గులాబీ రేకులను తినడం వల్ల ఇంద్రియాలను సంతృప్తిపరుస్తాయి. ఫలితంగా సహజమైన మార్గంలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 

ఇందుకోసం ఒక గ్లాసు వేడినీటిలో 10-15 తాజా గులాబీ రేకులను వేసి, నీరు గులాబీ రంగులోకి వచ్చే వరకు వుండాలి. ఈ ద్రావణంలో కొంచెం తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడిని జోడించవచ్చు. ఈ టీని క్రమం తప్పకుండా త్రాగుతుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

 
ఒత్తిడి- నిరాశను తగ్గిస్తుంది.
అలసట- ఒత్తిడితో నిద్రలేమి, చంచలత్వం వస్తుంది. ఇది చిరాకుకి దారితీస్తుంది. గులాబీ రేకులు, దాని సారాంశం ఈ లక్షణాలను కూడా అధిగమించగలవు. ఇందుకోసం ఏం చేయాలంటే... వేడి స్నానం చేయాలి. వేడి నీటిలో కొన్ని గులాబీ రేకులను చల్లాలి. వేడి గులాబీల సువాసనను విడుదల చేస్తుంది. బాత్రూమ్‌ను పువ్వుల సువాసనతో నింపుతుంది, మనస్సు - శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది.
 
మొటిమలతో బాధపడుతున్నట్లయితే, దానిని ఎదుర్కోవటానికి కొన్ని సహజ పద్ధతుల కోసం ఎదురుచూస్తున్నట్లయితే, రోజ్ వాటర్ సహాయపడవచ్చు. మంచి మాయిశ్చరైజర్‌గా ఉండటమే కాకుండా, గులాబీ రేకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల మొటిమలను పొడిగా చేస్తుంది. అలాగే ఫినైల్ ఇథనాల్ అనే క్రిమినాశక సమ్మేళనం ఉండటం వల్ల రోజ్‌వాటర్ మొటిమలకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది.
 
 
ఇందుకోసం రాత్రిపూట నీటిలో కొన్ని మెంతి గింజలను నానబెట్టి, రోజ్ వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి, 20 నిమిషాలు అలాగే ఉంచి, చల్లటి రోజ్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.