మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : శనివారం, 29 జులై 2017 (15:32 IST)

గ్రీన్ టీలో కలబంద గుజ్జు కలిపి తాగితే...

చాలామంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ బరువును తగ్గించుకునేందుకు వివిధ రకాలైన ఆరోగ్య చిట్కాలు పాటిస్తుంటారు. పస్తులుంటుంటారు. వైద్యులను సంప్రదిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామాలు చేస్తుంటారు.

చాలామంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ బరువును తగ్గించుకునేందుకు వివిధ రకాలైన ఆరోగ్య చిట్కాలు పాటిస్తుంటారు. పస్తులుంటుంటారు. వైద్యులను సంప్రదిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామాలు చేస్తుంటారు. ఇలాంటి ఇంటిపట్టునే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు.. బరువును సింపుల్‌గా తగ్గించుకోవచ్చు. 
 
గ్రీన్‌టీలో కొద్దిగా క‌ల‌బంద గుజ్జు క‌లిపి తాగుతున్నా అధిక బ‌రువు ఇట్టే త‌గ్గిపోతుంది. దీన్ని ఉద‌యం, రాత్రి తీసుకోవ‌చ్చు. అలాగే, నీటిని ఒక గ్లాసులో తీసుకుని అందులో కొద్దిగా క‌ల‌బంద‌, అల్లం ర‌సం క‌లిపి ఆ నీటిని కొద్దిగా వేడి చేసి తాగాలి. దీంతో ఒంట్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. అధిక బ‌రువు చాలా వేగంగా తగ్గుతారు. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున దీన్ని తాగితే ఫ‌లితం మరింత ఎక్కువగా ఉంటుంది. 
 
క‌ల‌బంద ర‌సాన్ని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగినా చాలు, ఫ‌లితం ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. రోజుకు రెండు పూటలా కొద్దిగా క‌ల‌బంద ర‌సం తీసుకుని దాన్ని స్ట్రాబెర్రీ పండ్ల‌తో క‌లిపి తినాలి. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు వేగంగా క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే, కొంతమందికి కలబంద రసం పడదు.. అందువల్ల వైద్యుల సలహా మేరకు దీన్ని తీసుకోవాల్సి వస్తుంది.