బొప్పాయి ఆకుల రసంతో బ్లడ్ ప్లేట్‌లెట్స్ పెంపు
మనిషి జీవించడానికి గాలి ఎంత అవసరమో.. శరీర భాగాల పనితీరుకు కూడా రక్తం అంతే అవసరం. రక్తంలో ప్లేట్లెట్స్ అనేవి ముఖ్యమైన మూలకాలు. ఏదైనా ప్రమాదానికి గురై రక్తస్రావం జరుగుతున్నప్పుడు రక్తాన్ని గడ్డకట్టేలా చేసి రక్తం పోకుండా కాపాడతాయి. సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుంచి 4,50,000ల ప్లేట్లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య తగ్గిపోతే ప్రాణానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. వివిధ రకాల మందులు వాడటం, డెంగ్యూ జ్వరం రావడం, మద్యం ఎక్కువగా సేవించడం, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించడం వలన కూడా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుంది. తక్కువ ప్లేట్లెట్స్ కౌంట్ ఉంటే కొన్నిసార్లు బ్లీడింగ్ కూడా అవుతుంది.
ముక్కులో నుంచి రక్తం కారడం, తీవ్ర తలనొప్పి, కండరాల నొప్పులు, మలంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అయితే కొన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మలో పాలీ ఫినోలిక్ ప్లవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ మైక్రోబియల్ యక్టివిటిని కలిగి ఉంటాయి. దాంతో పాటు దానిమ్మలో మిటమిన్ 'సి' అధికంగా ఉంటుంది.
ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రక్తంలో ప్లేట్లేస్ కౌంట్ పెంచడంలో గణనీయంగా సహాయపడుతుంది. కివి పండులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫోల్లెట్స్, పోటాషియం అధికంగా ఉన్నాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే సుక్ష్మ పోషకాలు ప్లేట్లెట్స్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడుతాయి.
బొప్పాయి, బొప్పాయి ఆకుల రసంలో కూడా ప్లేట్లెట్స్ కౌంట్‌ను పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్స్, ఫ్లోల్లెట్, ఫైబర్, పోటాషియంలు అధికంగా ఉంటాయి. ఇది డెంగ్యూ ఫీవర్‌ను తగ్గిస్తుంది. వైట్ బ్లడ్సేల్స్‌ను కూడా బొప్పాయి పెంచుతుంది. వీటితో పాటు బీట్ రూట్ తీసుకోవడం వలన రక్తహీనత సమస్యను తగ్గించుకుని ప్లేట్లెట్స్ కౌంట్‌ను కూడా పెంచుకోవచ్చు.
అలాగే క్యారట్, వెల్లుల్లి, ఆకుకూరలు, ఎండు ద్రాక్ష, ఖర్జురాలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వలన కూడా రక్తంలోని ప్లేట్లెట్స్ కౌంట్‌ను సహజంగా పెంచుకోవచ్చు.