మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (17:15 IST)

చెమట పొక్కులు వచ్చిన ప్రాంతాల్లో ఇలా చేస్తే..?

వేసవికాలం వచ్చిందంటే చాలు చెమట పొక్కులతో సతమతమవుతుంటారు. సాధారణంగా వేసవికాలంలో శరీరానికి చెమటపడుతుంది. ఆ క్రమంలో కొన్నిసార్లు చెమట గ్రంథులు మూసుకుపోతాయి. అప్పుడే చెమటకాయలు వస్తాయి. చర్మం ఎర్రగా కందిపోయి, చిన్నచిన్న నీటిపొక్కుల్లా మొదలవుతాయి. దాంతో విపరీతమైన మంటా, దురద మొదలవుతుంది. ఇవి శరీరంలో ఏ భాగంలోనైనా రావొచ్చు. అయితే వీటిబారి నుంచి తప్పించుకోడానికి కొన్నిచిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
చెమట పొక్కులు వచ్చిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాయాలి. ఇందులో యాస్ట్రింజెంట్‌ గుణాలు అధికంగా ఉంటాయి. చెమట పొక్కుల్నిమాత్రమే కాకుండా కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి.
 
ఎండాకాలంలో ప్రతి రోజూ రెండుమూడు సార్లు చల్లని నీటితో స్నానం చేయడం మంచిది. ఆహారంలో తరచు మంచినీళ్లు, మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. కొబ్బరినీళ్లు, అనాస రసం, చెరకు రసం ఈ వేసవి కాలంలో తీసుకుంటే చలువ చేస్తుంది, వేడిని తగ్గిస్తుంది.
 
ఐసుముక్కల్ని మెత్తని వస్త్రంలోకి తీసుకుని చెమట పొక్కుల మీద నెమ్మదిగా వత్తాలి. తరచూ ఇలా చేయడం వల్ల పొక్కులు త్వరగా తగ్గిపోతాయి. వాటివల్ల వచ్చే మంట కూడా అదుపులో ఉంటాయి.