శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (18:01 IST)

అలర్జీలకు కారణాలివే..?

శరీరం ఏదైనా పదార్థాన్ని స్వీకరించలేకపోవటం, సహించలేక పోవడాన్నే అలర్జీగా పిలుస్తున్నారు. ఫలానా ఆహారం తమకు పడదని, ఫలానిది తింటే దద్దుర్లు వస్తాయని చాలామంది చెబుతూ ఉండటాన్ని వింటూనే ఉన్నాం. వైద్య పరిభాషలో కొన్ని పదార్థాల పట్ల శరీరంలోని కణాలు భిన్న రీతిలో వ్యవహరించి ఆ లక్షణాలను వ్యక్తపరచటాన్ని అలర్జీగా చెబుతున్నారు. 
 
ఇలా శరీర కణాలు భిన్నరీతిలో వ్యవహరించటానికి అలర్జీ అనే మాంసకృత్తి కారణం. ఇది నీటిలో, గాలిలో, ఆహారంలో.. ఇలా ప్రతి చోటా ఉంటుంది. ఈ అలర్జీ కలిగి వున్న పదార్థం శరీరాన్ని తాకినా, లోపలికి ప్రవేశించినా కణాలు దాన్ని సరిగా స్వీకరించవు. శరీర కణాల ఈ అసాధారణ ప్రతిస్పందననే అలర్జీ అంటున్నారు.
 
అలర్జీ కారకాలు:
చిన్న పాటి ప్రభావాలు కలిగించే రకం మొదలుకుని తీవ్ర పరిణామాలు కలిగించే వరకు అలర్జీ కారకాలు వైవిధ్య పూరితంగా ఉంటున్నాయి. ముఖ్యంగా పసిపిల్లల్లోను అలర్జీ సులువుగా ప్రభావం చూపుతూ ఉంటుంది. 
 
వీరికి గుడ్లు, పాలు, గోధుమ వంటి పదార్ధాలు కూడా పట్టక పోవచ్చు. ఈ సమస్య ఐదేళ్ల పిల్లల వరకే వుంటుంది. అటు తర్వాత గాలిలో వుండే పుప్పొడి, దుమ్ము, ధూళి, జంతువుల రోమాలు మొదలైనవి అలర్జీని కలిగిస్తాయి. ఇంకా చేపలు, వివిధ రకాల మాంసం, గింజలు, టమోటాలు, నిమ్మ, నారింజ, చాక్లెట్లు వంటివి సైతం అలర్జీని కలిగిస్తాయి.