అరటిపండులో జీలకర్ర పొడి కలిపి తింటే..?
జీలకర్ర యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి వుండడం వలన జలుబును కలుగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర, అల్లం, తేనె, తులసి ఆకులు కలుపుకొని తాగడం వలన జలుబు నుండి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జీలకర్ర యాంటీ ఏజింగ్‌గా పనిచేసి చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తుంది. ఇందుకు జీలకర్రలో విటమిన్ ఇ ఎక్కువగా ఉండడమే కారణం. జీలకర్రలో ఎక్కువగా ఫైబర్, యాంటీ ఫంగల్, లాక్సైటీవ్స్, కార్మినేటివ్ గుణాలు ఉన్నాయి. ఇవి మొలలు నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతాయి.
జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివలన జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. రోజువారి ఆహారంలో జీలకర్ర తీసుకోవడం వలన రక్తంలోని షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివలన మధుమేహం అదుపులో ఉంటుంది. జీలకర్రలో క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉన్నాయి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా లభించడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ తయారవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
జీలకర్ర కడుపు నొప్పి, విరోచనాలు, అలసటను, అజీర్ణం వంటి వాటిని తగ్గిస్తుంది. కొత్తిమీరలో జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలిపి తాగితే జీర్ణ శక్తి పెంపొందిస్తుంది. శరీరంలోని అనవసరపు కొవ్వుని కరిగిస్తుంది. షుగర్ వ్యాధిని నివారిస్తుంది. అరటి పండును తీసుకుని దాన్ని బాగా నలిపి దాంట్లో జీలకర్ర పొడిని కలిపి తింటే హాయిగా నిద్రవస్తుంది. అధిక బరువు తగ్గుతారు.