ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ప్రాణాంతకమైన స్ట్రోక్స్ రావట.. తెలుసా?

Orange
మోహన్| Last Updated: మంగళవారం, 26 మార్చి 2019 (12:51 IST)
ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ప్రాణాంతకమైన స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా పరిశోధనల్లో తేలింది. ఇదే విషయాన్ని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రీషన్‌లోనూ ప్రచురించారు. నిత్యం ఆరెంజ్ జ్యూస్ తాగే వారిలో బ్రెయిన్ క్లాట్ అయ్యే అవకాశాలు 24 శాతం వరకు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

దీనితో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా 12 నుంచి 13 శాతం వరకు తక్కువగా ఉంటుందట. రోజువారీగా ఆరెంజ్ జ్యూస్ మాత్రమే కాకుండా ఏ జ్యూస్ అయినా తాగడం వల్ల ఏదో ఒక రకమైన ప్రయోజనం కచ్చితంగా కలుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే వీటిలో చక్కెర వేయకుండా తాగడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు.దీనిపై మరింత చదవండి :