ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By chj
Last Modified: మంగళవారం, 17 జనవరి 2017 (20:35 IST)

కుంకుమ పువ్వు ఖరీదైనదే... కానీ ప్రయోజనాలు అనేకం

కుంకుమ పువ్వులో ఎన్నో ఆసక్తికరమైన, వైవిధ్యభరితమైన విలువలు ఉన్నాయి. కుంకుమ పువ్వు ఆహారంలో రుచి కోసమే ఉపయోగిస్తారు. కానీ ఇది ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తిని పెరచుతుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. దీన్ని పురాతన పర్షియన్లు దైవంగా, పరిమళ ద్రవ్య

కుంకుమ పువ్వులో ఎన్నో ఆసక్తికరమైన, వైవిధ్యభరితమైన విలువలు ఉన్నాయి. కుంకుమ పువ్వు ఆహారంలో రుచి కోసమే ఉపయోగిస్తారు. కానీ ఇది ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తిని పెరచుతుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. దీన్ని పురాతన పర్షియన్లు దైవంగా, పరిమళ ద్రవ్యంగా, మెడిసిన్‌గా, స్నానానికి ఉపయోగించే వారు. అలాగే వస్త్రాలు తయారుచేసేటప్పుడు ఈ పదార్థాన్ని రంగు కోసం ఉపయోగించేవారు. కుంకుమ పువ్వు పొడిని వేడి పాలల్లో వేసుకుని తాగటం వల్ల మానసికంగా ఒత్తిడి దూరం అవుతుంది. 
 
మూడ్‌ను మార్చటంలో దీని పాత్ర కీలకం. దీన్ని పూర్వకాలంలో గాయాలు మానిపోవటానికి మెడిసిన్‌గా ఉపయోగించేవారు. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు కుంకుపువ్వు తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. కుంకుమ పువ్వును సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగిస్తారు. జన్యు పరంగా వస్తున్న వ్యాధులను నివారించటంలో కుంకుమ పువ్వు మంచి ఔషధం. అలాగే అజీర్ణం, అధిక రక్తపోటు, ఋతు సంబంధిత సమస్యలు ఉన్నవారు దీన్ని క్రమంతప్పకుండా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.
 
కుంకుమ పువ్వు ‘క్రోసిన్’, ‘క్రోసెటిన్’లను కలిగి ఉండటం వల్ల జ్ఞాపకశక్తిని పెంచుతుంది. వీటిని కలిగి ఉండటం వల్ల ‘అల్జీమేర్’ (Alzheimer) వంటి మెదడుకు సంబంధించిన వ్యాధుల చికిత్సగా ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వు జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మరియు ‘కాగ్నేటివ్’ వ్యాధికి చికిత్సలో చాలా శక్తివంతగా పనిచేస్తుంది. కుంకుమ పువ్వు క్యాన్సర్‌ను కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యంగా ఉన్న కణాలకు హాని కలిగించకుండా క్యాన్సర్ పెరగటాన్ని నియంత్రిస్తుంది. దీనివల్ల కుంకుమ పువ్వుని వివిధ రకాల క్యాన్సర్‌కు చికిత్సగా వాడుతున్నారు. 
 
కుంకుమ పువ్వును అస్తమా చికిత్సగా, శ్వాస గొట్టాలు సన్నగా అవటం వల్ల శ్వాస తీసుకోటానికి ఇబ్బందిగా ఉన్నపుడు, శ్వాస గొట్టాలను శుభ్రపరచే మూలకంగా మరియు శ్వాస తీసుకోటాన్ని సులభపరుస్తుంది. ఉపిరితిత్తులను శుభ్రపరచి, ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. కుంకుమ పువ్వు ‘లైకోపిన్’, క్రోసెటిన్ వంటి యాంటీ-ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉండటం వలన గుండెకి సంబంధించిన వ్యాధులను చికిత్సగా మరియు రక్త ప్రసరణను సరిగా అయ్యేలా చూస్తుంది. కుంకుమ పువ్వు వలన ఆకలి పెరుగుతుంది, దీని వల్ల ఆహారం ఎక్కువగా తీసుకొంటారు మరియు ఆరోగ్యంగా ఉంటారు.