1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
  4. World’s Most Expensive Coffee Made from Elephant Dung, Black Ivory Coffee

ఏనుగు పేడతో కాఫీ... అదే బ్లాక్ ఐవరీ కాఫీగా గుర్తింపు... ధర ఎంతో తెలుసా?

elephant dung
ఏనుగు పేడ నుంచి సేకరించిన గింజలతో తయారు చేసిన కాఫీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ ఐవరీ కాఫీగా గుర్తింపు పొందింది. దీని ధర కూడా రూ.4700గా ఉంది. కిలో కాఫీ గింజలు ధర 2 డాలర్ల వరకు ఉండొచ్చు. థాయ్‌లాండ్‌లో పరిమిత స్థాయిలో ఈ కాఫీని ఉత్పత్తి చేస్తున్నారు. ఏనుగుల జీర్ణ వ్యవస్థలో సహజ ప్రాసెసింగ్‌ చేస్తున్నారు. ఇదే ప్రపంచంలో అత్యంత అరుదైన, ఖరీదైన కాఫీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 
 
థాయ్‌లాండ్‌లో తయారయ్యే బ్లాక్ ఐవరీ కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ రకాలలో ఒకటి. దీని ధర కిలోకు దాదాపు 2 వేల డాలర్ల వరకు ఉంటుంది. ఒక కప్పు కాఫీ ధరే 50 డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.4700కు పైమాటే. ఈ కాఫీ ప్రత్యేకత ఏంటంటే, గింజలను ఏనుగుల జీర్ణవ్యవస్థ ద్వారా ప్రాసెస్ చేస్తారు. 
 
కాఫీ గింజలను బియ్యం, అరటిపండ్లు, ఇతర పండ్లతో కలిపి ఏనుగులకు ఆహారంగా ఇస్తారు. ఆహారం జీర్ణమయ్యే సమయంలో కాఫీ గింజలు కూడా ప్రత్యేక ప్రక్రియకు నోనవుతాయి. 15 నుంచి 17 గంటల తర్వాత ఏనుగుల మల విసర్జన నుంచి ఆ గింజలను సేకరించి శుభ్రపరుస్తారు. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి కాఫీ తయారు చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల కాఫీకి ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తుందని కాఫీ ప్రియులు చెబుతున్నారు. 
 
ఈ కాఫీ తయారీ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. గింజల సేకరణ నుంచి ప్రాసెసింగ్ వరకు ప్రతి దశలో అధిక శ్రమ అవసరం. అలాగే, ఉత్పత్తి పరిమితంగా ఉండటం కూడా ధర పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. కాఫీలో చాక్లెట్, నట్స్, మట్టి వాసనల మిశ్రమ రుచి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
About Writer
ఠాగూర్