లివింగ్ రూమ్, పిల్లల గదులకు నప్పే రంగులు

Ganesh|
లివింగ్ రూమ్ అనేది శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకునేది కాబట్టి, సాధ్యమైనంత సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి ఈ గదికి ఆకుపచ్చ, నీలం, గులాబి లాంటి పోస్టల్ రంగులు లేదా న్యూట్రల్ షేడ్‌లను వాడితే మంచిది.

ఇక ముఖ్యంగా చిన్న పిల్లలను ప్రభావితం చేసే వారి గదులకు ఎలాంటి రంగులు వాడాలో చూద్దాం. పిల్లలు వారి గదిలో ఆడటం, చదవటం, నిద్రపోవటం లాంటివి చేస్తారు కాబట్టి అదే వాళ్ల ప్రపంచం. వారిని ఆకట్టుకునేలాగా వారి గదులలో ఎన్నో రకాల ప్రయోగాలు చేయవచ్చు.

ముదురురంగులు వాడటమే గాకుండా, గోడలమీద రకరకాల డిజైన్లు వేయటం, ఒకే గోడమీద రెండు రంగులు వాడటం లాంటివి చేయవచ్చు. అంతేగాకుండా పిల్లలను సంప్రదించి వారి గదిని ఎలా ఉండాలని కోరుకుంటున్నారో తెలుసుకుని అందుకనుగుణంగా ఏర్పరిస్తే వారి ఆనందానికి అవధులే ఉండవు.

రంగుల విషయంలో గమనించాల్సింది ఏమిటంటే... ముదురు రంగులను ఎంపిక చేసుకోవడం మంచిదే అయినప్పటికీ వాటి ఖర్చు గురించి కూడా ముందుగానే తెలుసుకుని ఒక స్పష్టమైన అవగాహనతో ఉండటం మంచిది. ముదురురంగులతో కూడా గృహ సౌందర్యాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చో మనం చెప్పుకున్న రెండు వ్యాసాల ద్వారా తెలుసుకున్నారు కదూ...!


దీనిపై మరింత చదవండి :