శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 15 జూన్ 2017 (15:20 IST)

కన్నతల్లి కాన్పుకి సహకరించిన 12 ఏళ్ల బాలిక.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

అమెరికాలో ఓ చిన్నారి కన్నతల్లి కాన్పుకి సహకరించింది. తల్లి గర్భంతో వుండటం.. ఆమె ప్రసవాన్ని తాను చూడాలనుకుంది. అంతే అమెరికా వైద్యులు 12 ఏళ్ల బాలిక జెస్సీతో కన్నతల్లి ప్రసవానికి సహకరించేలా చేశారు. అమెరి

అమెరికాలో ఓ చిన్నారి కన్నతల్లి కాన్పుకి సహకరించింది. తల్లి గర్భంతో వుండటం.. ఆమె ప్రసవాన్ని తాను చూడాలనుకుంది. అంతే అమెరికా వైద్యులు 12 ఏళ్ల బాలిక జెస్సీతో కన్నతల్లి ప్రసవానికి సహకరించేలా చేశారు. అమెరికాలో మహిళ ప్రసవించే సమయాన ఆమె భర్త పక్కనుండాలనే నియమం వుంది. 
 
అయితే కన్నబిడ్డ తల్లి ప్రసవం చూడాలనుకోవడంతో వైద్యులు ఆమె కోరికను తీర్చారు. అమెరికాలోని మిస్సిస్సిప్పి అనే ప్రాంతానికి చెందిన ఓ హాస్పిటల్‌లో ఈ తంతు జరిగింది. 
 
డెలివరీ జరుగుతుండగా జెస్సీ స్వయంగా తన సోదరుడిని (తల్లి గర్భస్థ శిశువును) బయటికి తీసింది. ఆ సమయంలో జెస్సీ బోరున ఏడ్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను 1.2 మిలియన్ల మంది షేర్ చేశారు.