బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (19:20 IST)

ఛార్జింగ్‌లో స్మార్ట్‌ఫోన్.. పాటలు వింటూ నిద్రించిన బాలిక.. చివరికి ఏమైందంటే?

స్మార్ట్ ఫోన్లు లేకుండా ఒక సెకను కూడా వుండలేని వారు ఎందరో వున్నారు. స్మార్ట్ ఫోన్లను వాడే వారి సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఓ 14 ఏళ్ల బాలిక సెల్ ఫోన్‌లో పాటలు వింటూ నిద్రించింది. చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ ఘటన కజగస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సెల్ ఫోన్‌లో పాటలు వింటూ నిద్రించిన మహిళ.. ఆ సెల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో ప్రాణాలు కోల్పోయింది. కజగస్థాన్‌కు చెందిన బాస్పేట్ అనే గ్రామానికి చెందిన ఆల్వా అప్జల్ బెక్ (14) అనే బాలిక.. ఆదివారం రాత్రి సెల్ ఫోనులో పాటలు వింటూ నిద్రించింది. 
 
తెల్లవారైనా చాలాసేపటికి యువతి నిద్ర నుంచి మేల్కోకపోవడంతో అనుమానంతో తల్లిదండ్రులు ఆ యువతిని నిద్రలేపారు. ఆపై ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ యువతిని పరిశోధించిన వైద్యులు అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో.. 14 ఏళ్ల బాలిక రాత్రి నిద్రించే ముందు సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టింది. 
 
తలకు పక్కనే ఆ ఫోనును వుంచి.. హెడ్ ఫోన్ ద్వారా పాటలు వింటూ నిద్రించింది. సెల్ ఫోన్‌ చాలాసేపటికీ ఛార్జింగ్‌లో వుండటం ద్వారా బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో బాలిక తలకు గాయమై ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.