రాంగ్ రూటులో వస్తావా.. ఇప్పుడెలా బస్సును నడుపుతావో చూస్తా.. (వీడియో)
రాంగ్ రూటులో వచ్చిన ఓ బస్సుకు దారి ఇవ్వకుండా బస్సుకు అడ్డంగా ఓ స్కూటర్‌తో నిలిచిన మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆ వీడియో వైరలై కూర్చుంది. వివరాల్లోకి వెళితే, కేరళకు ప్రభుత్వానికి చెందిన ఓ బస్సు దారితప్పింది.
రాంగ్‌రూట్‌లో దాన్ని నడుపుకుంటూ వచ్చాడు డ్రైవర్. ఆ రోడ్డులో అన్నీ వాహనాలు వెళ్తూ వుంటే బస్సు మాత్రం రోడ్డులోనికి వస్తూ కనిపించింది. దీంతో ట్రాఫిక్ ఏర్పడింది. ఒన్ వే కావడంతో వాహనరాకపోకలకు ఇబ్బంది తప్పలేదు.
ఆ సమయంలో ఓ స్కూటర్‌పై వచ్చిన యువతి ఆ బస్సుకు ముందు అడ్డంగా నిలిచింది. దీంతో ఆ బస్సు ముందుకు నడవలేకపోయింది. ఈ నేపథ్యంలో టూవీలర్‌తో వచ్చిన ఆ యువతి అడ్డు తప్పుకుంటుందనుకున్న బస్సు డ్రైవర్‌కు చుక్కలు కనిపించాయి. ఏమాత్రం అటు ఇటు జరగకుండా టూవీలర్‌ను బస్సు ముందే పార్క్ చేసింది ఆ యువతి.
దీంతో ఆ బస్సు డ్రైవరే వెనక్కి బండిని నడిపాడు. దీంతో బస్సు రాంగ్ రూటు నుంచి సరైన మార్గంలో నడిపాడు ఆ బస్సు డ్రైవర్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సదరు యువతిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంకేముంది.. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.