1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (11:31 IST)

గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు - 40 మంది మృతి.. 100 మందికి గాయాలు

gaza strip
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 40 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇంకా వందమంది గాయపడినట్లు గాజాలోని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
డెయిర్ ఎల్-బలాహ్ నగరంలోని అనేక నివాస గృహాలపై ఇజ్రాయెల్ విమానం గురువారం దాడులు ప్రారంభించింది. ఈ ఘటనలో వందమంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది బాధితుల మృతదేహాలను అల్-అక్సా అమరవీరుల ఆసుపత్రికి తరలించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
ఇజ్రాయెల్ దాడులతో చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత ప్రజలను రక్షించేందుకు అంబులెన్స్‌లు, సివిల్ డిఫెన్స్ బృందాలు దాడులు జరిగిన ప్రదేశానికి చేరుకున్నాయని భద్రతా వర్గాలు తెలిపాయి.