గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (15:29 IST)

ఇజ్రాయేల్: డేగలు, రాబందు, ట్రాకింగ్ పరికరాలతో..?

eagle
ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల్లో మరణించిన వారి మృతదేహాలను వెతకడానికి డేగలు, రాబందులను ఉపయోగిస్తున్నారు. అక్టోబర్ 7న హమాస్ కార్యకర్తలు దాడి చేసిన ప్రదేశాల చుట్టూ శవాలను గుర్తించడంలో ఇజ్రాయెల్ సైన్యానికి ఈ పక్షులు సాయం చేస్తోందని ప్రాజెక్ట్‌లో పాల్గొన్న వన్యప్రాణుల నిపుణుడు తెలిపారు. 
 
డేగలు, రాబందు, ట్రాకింగ్ పరికరాలతో కూడిన ఇతర పక్షులు మానవ అవశేషాల కోసం అన్వేషణలో పాత్ర పోషించాయని ఇజ్రాయెల్ నేచర్ అండ్ పార్క్స్ అథారిటీకి చెందిన ఓహాద్ హట్జోఫ్ చెప్పారు. 
 
ఓహాద్ హట్జోఫ్ మాట్లాడుతూ, "యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఆ యూనిట్‌లో పనిచేస్తున్న కొంతమంది రిజర్వ్‌లు నన్ను సంప్రదించారు. నా పక్షులను సాయం కోసం అభ్యర్థించారు. ఆర్మీ హ్యూమన్ రిసోర్స్ బ్రాంచ్, యూనిట్ అయిన EITAN నుండి ఈ ఆలోచన, సలహా వచ్చింది. తప్పిపోయిన సైనికులను గుర్తించే బాధ్యత ఈ యూనిట్‌పై ఉంది... అంటూ చెప్పుకొచ్చారు.