శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (09:03 IST)

60 మంది గ్రామస్థులను కాల్చివేసిన సైనిక దుస్తుల్లోని సాయుధులు

military uniforms
ఉత్తర బుర్కినా ఫాసోలో దారుణం జరిగింది. సైనిక దుస్తుల్లో గ్రామంలోకి ప్రవేశించిన కొందరు సాయుధులు.. గ్రామస్థులను లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ దారుణం బుర్కినా ఫాసోలో జరిగింది. బుర్కినాట్ ఆర్మీ యూనిఫాం ధరించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మాలి సరిహద్దుకు సమీపంలో ఉండే యెటెంగా ప్రావిన్స్‌లోని కర్మా గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.
 
కాగా, ఘటన జరిగిన ప్రాంతంలో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న ఇస్లామిస్ట్ సంస్థల ఆధిపత్యం కొనసాగుతుంది. ఇక్కడ ఏళ్ల తరబడి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే, ఈ తాజా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. 
 
ప్రభుత్వ భద్రతా, స్వచ్చంధ రక్షణ బృందాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నప్పటికీ సాయుధ దళాలు పౌరులపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. గత 2022 తర్వాత ఇవి మరింత ఎక్కువైనట్టు మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఇదే ప్రాంతంలోని ఔహిగౌయాలో ఆర్మీ, స్వచ్ఛంధ రక్షణ బృందాలపై సాయుధులు జరిపిన దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు మరో 33 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెల్సిందే.