బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (12:37 IST)

భారత్‌లోకి చైనా బ్యాక్టీరియా మైక్రోప్లాస్మా.. ఏడు కేసులు నమోదు

kids
చైనా బ్యాక్టీరియా మైకోప్లాస్మా న్యుమోనియా భారతదేశంలోకి ప్రవేశించింది. చైనాలో ఈ వ్యాధి బీభత్సం సృష్టిస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆసుపత్రి ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్య ఏడు మైకోప్లాస్మా న్యుమోనియా కేసులను గుర్తించింది.
 
భారతదేశంలో మైకోప్లాస్మా న్యుమోనియాను గుర్తించడానికి నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా పోషకాహారం తీసుకోవడం.. వ్యాధినిరోధక శక్తిని పెంచడం ద్వారా పిల్లల్లో న్యూమోనియాను దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. ఇంకా సూర్యరశ్మి పిల్లల శరీరంపై పడేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.