గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (12:16 IST)

సచిన్ కుమార్తె సారాకు శుభమన్ గిల్ గుడ్‌బై... బాలీవుడ్ నటితో షికార్లు...

avaneet  kaur - gill
మాస్టర్ బ్లస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో భారత యువ క్రికెటర్ శుభమన్‌ గిల్‌పై గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ పుకార్లను కూడా వారిద్దరూ పలు సందర్భాల్లో బహిరంగంగా కూడా నిరూపించారు. క్రికెట్ స్టేడియాలకు వచ్చి గిల్ ఆటతీరును ప్రత్యేకంగా వీక్షించడం. ఒకరి పోస్టులకు మరొకరు లైక్ కొట్టడం వంటివి ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. అయితే, సోషల్ మీడియాలో ఇంత రచ్చ నడుస్తున్నా తమ రిలేషన్‌పై ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించలేదు. ఇపుడు శుభమన్ గిల్‌ ఇపుడు తన ప్రియురాలిని మార్చేశారనే ప్రచారం సాగుతుంది. దీనికి కారణం లేకపోలేదు. 
 
బాలీవుడ్ నటి అవనీత్ కౌర్‌తో కలిసి లండన్ వీధుల్లో షికార్లు కొడుతున్న ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వీరిద్దరూ ఓ ఆల్బం సాంగ్ చిత్రీకరణ కోసం లండన్ వెళ్లినట్టు సమాచారం. ఓ పంజాబీ ఆల్బన్ కోసం వీరిద్దరూ నిర్మాత రాఘవశర్మ, అన్షుల్ గార్గ్ కూడా వెళ్లారు. వైరల్ అవుతున్న ఫోటోలో గిల్, అవనీత్‌తో పాటు వీరి కూడా ఉన్నారు. గిల్ కూడా ఈ పాటలో నటిస్తున్నాడా? లేదంటే విహారయాత్రలో భాగంగా, లండన్‌ వెళ్తే అక్కడ వీరు తారసపడ్డారా? అన్నది తెలియాల్సివుంది.