మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (23:23 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. వారికి డిసెంబర్ 1 కూడా సెలవు

telangana assembly
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నవంబర్ 29, 30 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగింది. పోలింగ్ రోజున కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు మరికొన్ని జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. 
 
ఇకపోతే.. ఎన్నికల విధుల్లో పాఠశాల, ఇంటర్‌ విద్యాశాఖ, సాంకేతిక, ఉన్నత విద్యాశాఖల సిబ్బంది పాల్గొంటున్నారు. ఈనెల 30న అర్ధరాత్రి వరకు వారు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారికి డిసెంబరు 1న ప్రత్యేక సెలవు (స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌) ఇస్తూ పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. 
 
పోలింగ్ కేంద్రాల నుంచి స్వస్థలాలకు చేరుకోవటం తదితర కారణాలతో డిసెంబర్ 1న వారికి ప్రత్యేకంగా సెలవు ప్రకటించారు.