బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (22:43 IST)

వైట్ బాల్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ బ్రేక్

virat kohli
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత.. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టీ20 మ్యాచ్‌లు ఆడటం లేదు. ఈ నేపథ్యంలో సఫారీలతో టీ20 సిరీస్‌కు విరాట్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. 
 
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ నడుస్తోంది. ఇది పూర్తి కాగానే టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. 
 
ఈ నేపథ్యంలోనే... వైట్ బాల్ క్రికెట్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు కింగ్ కోహ్లి బీసీసీఐకు సమాచారం ఇచ్చాడని తెలిసింది.