మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (23:16 IST)

బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

Padi Kaushik Reddy
Padi Kaushik Reddy
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన మంగళవారం భావోద్వేగ ప్రసంగం చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని హుజూరాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్రకు వస్తానని, లేదంటే నాలుగో తేదిన మా ముగ్గురి శవయాత్రకు మీరు రావాల్సి వస్తుందని, ఏ యాత్రకు వస్తారో మీరు నిర్ణయించుకోవాలని ప్రజలను ఉద్దేశించి మాట్లాడటంపై కేసు నమోదైంది. 
 
ఈ వ్యవహారంపై కమలాపూర్ ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.