గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (19:41 IST)

కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ప్రచారం

revanth reddy
పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పలు గ్రామాలలో కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొంటారు. 
 
ఇక మంగళవారం వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్, కామారెడ్డి నియోజకవర్గాలలో ప్రచారం చేస్తారు రేవంత్ రెడ్డి. ఈనెల 15వ తేదీన బోథ్, నిర్మల్, జనగామ బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
 
కాగా, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు బాగా చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌పై దాడి జరిగినప్పుడు హరీశ్ రావు బాగా నటించారు.