ఆప్ఘనిస్థాన్‌లో మినీబస్సుల్లో బాంబు పేలుళ్లు- తొమ్మిది మంది మృతి
ఆప్ఘనిస్థాన్‌లో మినీబస్సుల్లో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. రంజాన్ సందర్భంగా ప్రయాణికులు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి విడిచిపెట్టడానికి ఇంటికి వెళుతుండగా ఈ బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నట్లు బల్ఖ్ ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి ఆసిఫ్ వజిరి చెప్పారు.
ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మృతిచెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజా ఘటనతో తాలిబన్ బలగాలు అప్రమత్తమయ్యాయి. షియాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా జరిగిన దాడికి తామే కారణమంటూ ఐఎస్ఐఎస్ తెలిపింది.
ఇదిలా ఉంటే గతేడాది ఆగస్టులో తాలిబాన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత వారమే మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించిన విషయం తెలిసిందే.