1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ఇస్లాం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 25 ఏప్రియల్ 2022 (16:27 IST)

రంజాన్‌: ఉపవాసం- కుటుంబంతో వేడుకల సమయం పంచుకుందాం రండి

Haleem
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం ప్రారంభమైంది. ఈ నెలలో, ముస్లింలు అల్లా పట్ల పూర్తి భక్తిని చాటడంతో పాటుగా అల్లా దయ కోరుకుంటుంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉపవాస దీక్ష కొనసాగిస్తుంటారు.


సూర్యోదయానికి ముందు సుహార్‌; సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్‌ విందు కానిస్తారు. ఈ ఇఫ్తార్‌ సమయంలో స్నాక్స్‌, అపెటైజర్స్‌, బేవరేజస్‌, డిసెర్ట్స్‌ పూర్తి వైవిధ్యంగా, అద్భుతమైన రుచులతో ఉంటాయి. ఇఫ్తార్‌ విందును కుటుంబ సభ్యులతో కలిసి వేడుక చేసుకోవడం లేదా మసీదులు, ఇతర ప్రాంగణాలలో కమ్యూనిటీతో కలిసి చేసుకోవడం జరుగుతుంది.

 
ఈ రంజాన్‌ వేళ ఇఫ్తార్‌ విందు సమయంలో ఆస్వాదించతగిన 10 రంజాన్‌ ఫుడ్స్‌ను గురించి కలినరీ స్పెషలిస్ట్‌ పల్టి హరినాథ్‌ వివరిస్తున్నారు. సాధారణంగా రంజాన్‌ వేళ ఉపవాసదీక్షను ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్‌, సీజనల్‌ ఫ్రూట్స్‌, నిమ్మరసంతో ముగిస్తారు. ఆ తరువాత తీసుకునే ఆహారాలలో...

 
1. హలీం: ఇఫ్తార్‌ విందులో తప్పనిసరిగా దర్శనమిచ్చే ఫుడ్‌ వెరైటీ ఇది.  మటన్‌ను పప్పుదినుసులు, గోధుమలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్‌లో నెమ్మదిగా ఉడికించి తయారుచేస్తారు. అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది.

 
2. కెబాబ్స్‌: కెబాబ్స్‌ను తినడాన్ని ఇష్టపడనివారెవురుంటారు. మటన్‌ లేదంటే చికెన్‌ ముక్కలను పెరుగు, మసాలాలలో నానబెట్టి అనంతరం  ఫ్రై చేయడం లేదా స్ర్కూ చేయడం లేదా బార్బిక్యు చేయడం ద్వారా చేస్తారు.

 
3. చికెన్‌ షావార్మా: అత్యంత ప్రాచుర్యం పొందిన మధ్య ప్రాశ్చ్య డిష్‌ ఇది. సన్నగా కోసిన చికెన్‌ లేదా మటన్‌ ముక్కలను బ్రెడ్‌ లోపల కూరగాయలు, సాస్‌ కలిపి తీసుకోవడం చేస్తారు. అత్యంత రుచికరంగా మాత్రమే కాదు ఇదే ఓ మీల్‌లా సరిపోతుంది.
Samosa

 
4. కీమా సమోసా: ఇఫ్తార్‌ వేడుకలు ఇది లేకుండా పూర్తి కాదు. గోధుమ పిండి, మటన్‌‌తో తయారుచేసే ఈ సమోసాలు భారతీయ రుచుల సంగమంగా నిలుస్తాయి.

 
5. మటన్‌ రెసాలా: మటన్‌రెసాలా అనేది అథెంటిక్‌ బెంగాలీ డిష్‌. బోన్‌ మటన్‌ పీస్‌లను పెరుగులో నానబెట్టి , జీడిపప్పు, గసగసాల పేస్ట్‌తో పాటుగా భారతీయ మసాలాలు కూడా కలిపి తయారుచేస్తారు. పరాటా లేదా నాన్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.

 
6. దమ్‌ బిర్యానీ: దేశవ్యాప్తంగా దీనిని విభిన్న రకాలుగా చేస్తారు. దక్షిణ భారతదేశంలోనే దీనిని విభిన్న రకాలుగా చేయడం కనిపిస్తుంది. ప్రధానంగా బియ్యం, మటన్‌ లేదా చికెన్‌, మసాలాలను నెయ్యి, కుంకుమపువ్వుతో చేస్తారు. కొన్నిసార్లు కూరగాయలు, సోయా ముక్కలు, సీఫుడ్‌తో కూడా ఈ బిర్యానీ చేయడం కనిపిస్తుంది.
 
7. ఫలాఫెల్‌: బటానీ గింజలు లేదంటే ఫవా బీన్స్‌ లేదా రెండింటినీ కలిపి తయారుచేసిన బాల్‌ లేదా పట్టీ ఫలాఫెల్‌.  వీటిని సాధారణంగా హమ్మస్‌తో పాటుగా తహినీ సాస్‌తో కలిపి ఇఫ్తార్‌ సమయంలో సర్వ్‌ చేస్తారు. అంతర్జాతీయంగా ఎక్కువ మంది ఇష్టపడే వంటకాలలో ఫలాఫెల్‌ ఒకటి.
Kebab

 
8. షీర్‌ ఖుర్మా: రంజాన్‌ సమయంలో విరివిగా కనిపించే మొఘలాయ్‌ తియ్యందనం షీర్‌ ఖుర్మా. షీర్‌ అంటే పాలు, ఖుర్మా అంటే ఖర్జూరం. ఈ షీర్‌ఖుర్మా ఆకృతి మాత్రమే కాదు, రుచి కూడా వినూత్నంగా ఉంటుంది. ఈ రంజాన్‌ మాసంలో కనిపించే మొదటి డిసెర్ట్‌ ఇది.

 
9. అఫ్లాటూన్‌: రంజాన్‌ వేళ వడ్డించే ప్రత్యేక తియ్యందనం అఫ్లాటూన్‌. స్వచ్ఛమైన నెయ్యి, నట్స్‌తో తయారుచేస్తారు. రంజాన్‌ వేళ భోజనం ముగించేందుకు అత్యుత్తమ డిష్‌ ఇది.

 
10. రూ అఫ్జా: రంజాన్‌ మాసంలో సాధారణంగా తయారుచేసే షర్బత్‌ ఇది. దీనిలో వనమూలికలు, పండ్లు, కూరగాయలు, పూలు, వేర్లు కూడా భాగంగా ఉంటాయి. ప్రత్యేకమైన రుచులు, కూలింగ్‌ ఎఫెక్ట్‌ దీనిని మిలిగిన పానీయాలకు భిన్నంగా నిలుపుతుంది. ఈ రూ అఫ్జా సిరప్‌ను కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, సేమియాలలో కూడా కలిపి తీసుకోవచ్చు.

recipe
గోల్డ్‌ డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ, ‘‘రంజాన్‌ మాసంలో గొప్పతనమేమిటంటే, దాని పవిత్రతతో అది కుటుంబం మొత్తాన్నీ ఒకేచోట చేర్చుతుంది. ఇది నిజంగా జష్న్‌-ఏ-రంజాన్‌. ఇది అందరినీ ఏకం చేయడంతో పాటుగా పవిత్ర మాసాన్ని మరింత అర్ధవంతంగా, దైవికంగా మలుస్తుంది’’ అని అన్నారు.
 
ఇంకా ఈ రుచుల ఆస్వాదన చేయలేదా... ఈ నెల ముగిసేలోపుగానే ఆ ఆస్వాదన చేయండి!