1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 15 మార్చి 2021 (12:29 IST)

17 ఏళ్లు కుర్రాడిని తండ్రిని చేసిన 32 ఏళ్ల లేడీ జిమ్ టీచర్

మహిళలపై అత్యాచారాలు చోటుచేసుకోవడం వార్తల్లో వస్తుంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. 17 ఏళ్ల బాలుడిపై అతడికి వ్యాయామ ఉపాధ్యాయురాలిగా తర్ఫీదునిచ్చే మహిళ పలుమార్లు అత్యాచారం చేసింది. జిమ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన మెళకువలు అంటూ అతడిని లైంగికంగా వాడుకుంది. ఫలితంగా ఆమె గర్భవతి అయ్యింది.
 
అమెరికాలో జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. జిమ్ ట్రైనర్‌గా వున్న సదరు మహిళ తన వద్దకు వచ్చే కుర్రవాడిని లైంగికంగా లొంగదీసుకుని అతడితో పలుమార్లు సెక్సులో పాల్గొంది. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ట్రైనర్ తన పట్ల ప్రవర్తిస్తున్న తీరు గురించి బాలుడు ఇంట్లో చెప్పడంతో ఆమె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
వెంటనే ఆ కుర్రవాడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆకు వైద్య పరీక్షలు చేయగా ఆమె 2 నెలల గర్భవతి అని తేలింది. గతంలో కూడా పలువురు విద్యార్థుల పట్ల ఆమె ఇలాగే వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.