శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (16:46 IST)

"బాయ్స్" ఫస్ట్లుక్ విడుదల చేసిన హీరో కార్తికేయ

Boys ist look
సినిమా రంగంలో, బిజినెస్ రంగంలో రాణిస్తూ ఏంతో మందికి సహాయం చేస్తూ సక్సెస్ విమెన్గా దూసుకు పోతున్న మిత్ర శర్మ ఈ రోజు ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకొంది. శ్రీపిక్చర్స్ పతాకంపై మిత్రశర్మ, గీతనంద్ జంటగా దయానంద్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్రశర్మ నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం "బాయ్స్". దీనికి (బాయ్స్ విల్ బి బాయ్స్)  అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ వేడుక హైదరాబాద్లోని దస్ బల్లా హోటల్లో కన్నుల పండుగలా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన హీరో కార్తికేయ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. సుచిర్ ఇండియా కిరణ్, కళా మందిర్ కళ్యాణ్ శ్రీ పిక్చర్స్ పోస్టర్స్, లోగోలను విడుదల చేశారు.
 
అనంతరం కార్తికేయ మాట్లాడుతూ.. మిత్ర శర్మ సినిమా, బిజినెస్ రంగాల్లో రాణిస్తూ ఈ రోజు  ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమా నిర్మిస్తుంది.బాయ్స్ అయిన మనమే భయపడి వెనుకడుగు వేస్తాము అలాంటిది తాను బ్యానర్ పెట్టి "బాయ్స్" మూవీ  తీస్తుంది. నా మూవీ షూట్ లో ఉండగా ఈ మూవీ గురించి, మిత్ర గురించి విన్నాను. తను మూవీలో హీరోయిన్ గా చేస్తూ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుందని విని షాక్ అయ్యాను.ఎందుకంటే ఎక్కువగా హీరో గా చేస్తూ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంటారు.తను ఎంతో డేరింగ్ స్టెప్ తీసుకొని చేస్తున్న ఈ సినిమా టైటిల్ క్యాచీగా బాగుంది. అప్పట్లో శంకర్ తీసిన "బాయ్స్" మూవీ అంత పెద్ద హిట్ అవ్వాలి. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద బ్యానర్ల సరసన ఈ బ్యానర్ నిలిచి పెద్ద సినిమాలు నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు..
 
చిత్ర హీరోయిన్, నిర్మాత మిత్ర శర్మ మాట్లాడుతూ, ఒక సక్సెస్ ఫుల్ మగాడు వెనుక ఒక ఆడది వుంటుందంటారు. అయితే నా వెనుక నన్ను సపోర్ట్ చేసే మంచి టీం వుంది. 2014 లో ఇండస్ట్రీ కు వచ్చిన నేను చాలా సినిమాల్లో యాక్టింగ్ చేశాను. తరువాత సొంతంగా ఫెసిలిటీ మేనేజిమెంట్ సర్వీసెస్" బిజినెస్ స్టార్ట్ చేశాను. 2018లో వచ్చిన ఐ.పి.యల్ తో  మా బిజినెస్ కు మంచి బూమ్ రావడంతో మా లైఫ్ మారిపోయింది. 2019లో  "యాస్ ట్యాగ్  బాయ్స్" స్టార్ చేశాము. సొంత ప్రొడక్షన్ పెట్టాలని నేను అనుకోలేదు కానీ మాకు టైం అలా కలసి వచ్చింది.ఆ తరువాత దర్శకుడు దయానంద్ చిన్న వాడైనా మంచి కాన్సెప్ట్ ఉన్న కొత్త కథ వినిపించాడు. ఎంతో కాన్ఫిడెంట్ గా తను చెప్పిన కథ చెప్పిన విధానం నచ్చి తన కోసమే ఈ సినిమా చేస్తున్నాను. అరిస్టు లందరి సపోర్ట్ తో ఈ మూవీని సింగల్ షెడ్యూల్ లో మూవీని పూర్తి చేస్తాము.ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అన్నారు.
 
చిత్ర దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ, నేను చెప్పిన కథ నచ్చడంతో నన్ను ఇండస్ట్రీ కు పరిచయం చేయాలని నా కోసమే ఈ సినిమా తీస్తున్నారు. తను నాపై పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టేలా ఈ సినిమా కొత్తగా ఉంటుంది.ఈ శ్రీ పిక్చర్స్ బ్యానర్ ద్వారా ఎంతో మంది నటులకు అవకాశం లభించింది. ఈ సినిమా కోసం అందరూ చాలా ప్యాసినెట్గా మూవీ తీస్తున్నాము.అందరి సపోర్ట్ తో చేస్తున్న ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు..
ఇంకా ఈ కార్యక్రమంలో రోనీత్, శ్రీహన్, సుజిత్ బన్నీ, బంచీక్ బబ్ల్యూ, అభిలాశ్ లు ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి. నిర్మాతలు మాలాంటి ఎంతో మందిని ఇండస్ట్రీకు పరిచయం చేసేలా ఎన్నో చిత్రాలు నిర్మించాలని అన్నారు.