శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (16:30 IST)

ఎయిర్‌హోస్టెస్ ముఖంపై న్యూడిల్స్‌ కప్‌లోని వేడి నీళ్లను విసిరింది..

ఎయిర్‌హోస్టెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విమానాల్లోని ప్రయాణీకులకు ఆహారం అందించడంతో పాటు వారికి అవసరమైన వస్తువులను అందజేస్తుంటారు. ప్రయాణీకులు తమ పట్ల ఎంత కఠినంగా ప్రవర్తించినా వారు నిస్సహాయులుగా వుండాల్సిన పరిస్థితి. ఇలా ఓ ప్రయాణీకురాలు చేసిన చేష్టలకు ఆ ఎయిర్ హోస్టెస్ కామ్‌గా వుండాల్సిన స్థితి. 
 
వివరాల్లోకి వెళితే.. ఎయిర్‌ హోస్టెస్‌లతో కొందరు ప్రయాణికులు అమర్యాదగా ప్రవర్తించిన ఘటనలు బయటికొస్తున్న తరుణంలో ఎయిర్‌ ఏషియాలో ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్న నురాలియా మజ్లాన్.. తన సహోద్యోగిపై జరిగిన దాడిని వివరించారు. కొన్నాళ్ల కిందట ఆ ఎయిర్‌ హోస్టెస్‌తో చైనాకు చెందిన ఓ ప్రయాణికురాలు దురుసుగా ప్రవర్తించింది. 
 
అదే ఫ్లైట్‌లో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ పక్కన ఆమెకు కూర్చొనే అవకాశం దక్కలేదు. సీట్ల మార్పుకు ఇతర ప్రయాణికులు అంగీకరించలేదు. దీంతో ఆవేశానికి లోనైన ఆమె ఎయిర్‌ హోస్టెస్‌పై దాడి చేసింది. 
 
ఎయిర్‌ హోస్టెస్‌ ముఖంపై న్యూడిల్స్‌ కప్‌లోని వేడి నీళ్లను విసిరింది. అంతటితో ఆగకుండా ఎయిర్‌ హోస్టెస్‌పై పెద్దగా కేకలు వేసింది. ఆ  తర్వాత విమానం ల్యాండ్‌ కాగానే ఆమెను ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇంత కఠినంగా ప్రవర్తించిన ఆమెను మాత్రం సదురు ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించారని నురాలియా తెలిపారు. కానీ ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో జరుగుతూనే వున్నాయని చెప్పుకొచ్చారు. ప్రయాణీకులను తిరిగి ప్రశ్నించడం, వారిని అదుపు చేయలేని స్థితిలో ఎయిర్ హోస్టెస్ వుంటారని అందుకే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ వుంటాయని వెల్లడించారు.