ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (17:48 IST)

కీటకాలపై అమితమైన ప్రేమ.. ఆ వీడియోలతో అడ్రియా ఫేమస్.. ఎఫ్‌బీకి 2.70లక్షల లైకులు

సోషల్ మీడియా ప్రభావంతో ఏది తోచితే దాన్ని పోస్ట్ చేయడం.. అభిప్రాయాలను పంచుకోవడం, ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.. వింతలు విశేషాలు కూడా అందులో పొందుపరుస్తున్నారు. మీడియా కంటే వేగంగా సోషల్ మీడియా దూసుకుపోతో

సోషల్ మీడియా ప్రభావంతో ఏది తోచితే దాన్ని పోస్ట్ చేయడం.. అభిప్రాయాలను పంచుకోవడం, ఫోటోలను షేర్ చేయడమే కాకుండా.. వింతలు విశేషాలు కూడా అందులో పొందుపరుస్తున్నారు. మీడియా కంటే వేగంగా సోషల్ మీడియా దూసుకుపోతోంది. తాజాగా జర్మనీకి చెందిన ఓ యువకుడు ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో బాగా ఫేమస్ అయిపోయాడు. 
 
ఇంతకీ ఏం చేశాడంటే? జర్మనీకి చెందిన అడ్రియన్ కోజాకీవిజ్ అనే ఇతగాడు కీటకాలను పెంచాడు. అదే అలవాటుగా పెట్టుకున్నాడు. వాటిపై ప్రేమను కనబరిచి.. వాటితో ఆడుకుంటాడు. శరీరంపై ఎక్కించుకుని సరదాపడుతుంటాడు. ముఖంపై అవి పరిగెడుతుంటే హ్యాపీగా ఫీలవుతాడు. ఇలా అతడు పెంచిన కీటకాలతో ఆడుకునే వీడియోలను ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రాం, యూట్యూబ్‌లలో పోస్టు చేస్తుంటాడు. దీంతో అడ్రియా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు.
 
ఇందులో భాగంగా అతడి ఫేస్‌బుక్‌ పేజీకి 2.70 లక్షల లైకులున్నాయి. అతడి ఇన్‌స్టా గ్రాం ఖాతాను 55 వేల మంది ఫాలో అవుతున్నారు. యూట్యూబ్‌లో అతడి వీడియోలను వేలాదిమంది చూస్తున్నారు.