మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (17:36 IST)

పంజ్‌షేర్‌ వ్యాలీలో తాలిబన్లకు షాక్.. నార్తర్న్ అలయెన్స్

పంజ్‌షేర్‌ వ్యాలీలో తాలిబన్లకు కోలుకోలేని షాకిచ్చినట్టు నార్తర్న్‌ అలయెన్స్‌ బలగాలు ప్రకటించాయి. తాజాగా 350 మంది తాలిబన్లను హతం చేసినట్టు నార్తర్న్‌ అలయెన్స్‌ ప్రకటించింది.
 
అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘన్‌ విడిచి వెళ్లడంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నారు. కాందహార్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 
 
ఆర్మీ ట్యాంకులు, వాహనాలతో భారీ ర్యాలీ తీశారు. ఖోస్త్‌లో అమెరికా , నాటో బలగాలకు శవయాత్ర నిర్వహించారు తాలిబన్లు. ఇప్పటికి తమకు సంపూర్ణ అధికారం దక్కిందని సంబరాలు చేసుకుంటున్నారు.