సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (11:42 IST)

శాన్‌ డియాగోలో కూలిన యూఎస్ నేవీ హెలికాఫ్టర్

అమెరికా రక్షణ శాఖకు చెందిన నేవీ హెలికాఫ్టర్ ఒకటి ప్రమాదానికి గురైంది. యూఎస్ఎస్ అబ్ర‌హం లింక‌న్ నుంచి టేకాఫ్ అయిన ఆ హెలికాప్ట‌ర్ శాన్ డియాగో ద‌గ్గ‌ర స‌ముద్రంలో కూలిన‌ట్లు యూఎస్ నేవీ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఇందులో ఉన్న ఐదుగురు ఆచూకీ తెలియాల్సివుంది. 
 
ఆ హెలికాప్ట‌ర్‌తోపాటు అందులోని సిబ్బంది కోసం గాలిస్తున్న‌ట్లు చెప్పింది. రోజువారీ విధుల్లోభాగంగా ఫ్లైట్ ఆప‌రేష‌న్స్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో శాన్ డియాగోకు 60 నాటిక‌ల్ మైళ్ల దూరంలో హెలికాప్ట‌ర్ కూలిన‌ట్లు ప‌సిఫిక్ ఫ్లీట్ ట్వీట్ చేసింది. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.