శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (12:05 IST)

బెంగుళురూ రోడ్డు ప్రమాదం : డీఎంకే ఎమ్మెల్యే కొడుకు - కోడలు మృతి

కర్నాటక రాజధాని బెంగుళూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ మృతుల్లో ఒకరు తమిళనాడు హోసూరు డీఎంకే ఎమ్మెల్యే ప్రకాష్ కుమారుడు, కోడలు ఉన్నారు. 
 
అతి వేగంతో వచ్చిన ఆడి కారు.. రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై. ప్రకాశ్‌ కుమారుడు కరుణసాగర్‌, కోడలు బిందు సహా ఏడుగురు మృతి చెందారు. ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. 
 
మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. డివైడర్‌ను ఢీకొని కారులో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రతను పెంచింది. సోషల్‌ మీడియాలో ప్రమాదానికి సంబంధించిన చిత్రాలు చక్కర్లు కొడుతున్నాయి.1 ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.