శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 మే 2021 (14:53 IST)

స్వైన్ ఫీవర్.. 1700 పందుల మృతి.. రూ.6.91 కోట్ల నష్టం

దేశమంతా కరోనా మహమ్మారి వీర విహారం చేస్తుంటే ఈశాన్య రాష్ట్రం మిజోరంను మరో కొత్త వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్‌) అనే కొత్త వ్యాధితో మిజోరంలో నిత్యం పదుల సంఖ్యలో పందులు మృత్యువాత పడుతున్నాయి. 
 
గత మార్చి 21న తొలి మరణం నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం 1700 పందులు మృతిచెందాయి. ఈ వ్యాధి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాకుతూ రాష్ట్రమంతటా వ్యాపిస్తోంది. 
 
మిజోరంలో గత నెల రోజులకుపైగా తిష్టవేసిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కారణంగా పందుల మరణాల రూపంలో రూ.6.91 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
ప్రధానంగా ఐదు జిల్లాల్లో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. ఐజ్వాల్‌, లంగ్లేయ్‌, సెర్చిప్‌, లౌంగ్‌ట్లాల్‌, మామిత్ జిల్లాల్లో వ్యాధి విస్తరణ ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు.