1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 9 నవంబరు 2016 (19:50 IST)

భారత్ భుజంతో కలిపి నడుస్తాం... ఐ లవ్ ఇండియా.... ట్రంప్ వ్యాఖ్యలు(Video)

హిల్లరీ గెలిస్తే పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉంటారన్న ప్రచారాన్ని ఇటీవల అమెరికన్ హిందూ సంస్థ చేసింది. ఆ ప్రకటనల మహిమో ఏమోగానీ రిపబ్లికన్ పార్టీ తరపున నిలిచిన డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా విజయం సాధించి అమెరికా అధ్యక్షులయ్యారు. ఆయన అధ్యక్షుడయితే భారతదేశానికి

హిల్లరీ గెలిస్తే పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉంటారన్న ప్రచారాన్ని ఇటీవల అమెరికన్ హిందూ సంస్థ చేసింది. ఆ ప్రకటనల మహిమో ఏమోగానీ రిపబ్లికన్ పార్టీ తరపున నిలిచిన డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా విజయం సాధించి అమెరికా అధ్యక్షులయ్యారు. ఆయన అధ్యక్షుడయితే భారతదేశానికి ఇబ్బందే అని వాదనలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని విశ్లేషకులు అంటున్నారు. 
 
భారతదేశం పట్ల ట్రంప్ చాలా అనుకూలంగా ఉన్నారనీ, ప్రధానమంత్రి మోదీ పాలనపైన ప్రశంసలు కురిపించిన సంగతిని గుర్తు చేశారు. గతంలో ట్రంప్ ఐ లవ్ ఇండియన్స్ అంటూ చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ, భారతదేశంతో మైత్రి బంధం బలోపేతానికి ఆయన మరింత కృషి చేస్తారని అంటున్నారు. భారతదేశంపై జరుగుతున్న ఉగ్రదాడులను ఆయన ఖండించారనీ, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని అణచివేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలను చూపుతున్నారు. భారతదేశం పట్ల ట్రంప్ వైఖరి ఈ వీడియోలో చూడవచ్చు....