సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (14:10 IST)

అగ్రరాజ్యం అమెరికాలోని ఓ స్కూల్‌లో మళ్లీ కాల్పుల మోత

అగ్రరాజ్యం అమెరికాలోని ఓ పాఠశాలలో మళ్లీ తుపాకీ కాల్పుల మోత వినిపిచింది. ఈ కాల్పుల నుంచి 20 విద్యార్థులను ఓ తెలుగు వ్యక్తి రక్షించారు. అమెరికాలోని సౌత్ కారోలీన్ టాంగిల్ పుడ్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై తుపాకీ కాల్పులు జరిపాడు. 
 
దీంతో కాల్పులు శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను సురక్షితంగా దగ్గర్లోని చర్చికి తరలించారు. ఈ దాడిలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రీన్ విల్లే కౌంటీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కాల్పులు జరిపిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అంతకుముుందు విద్యార్థి కాల్పులు జరుపుతుంటే విజయవాడకు చెందిన కోనేరు శ్రీధర్ అనే వ్యక్తి చాకచక్యంగా 20 మంది విద్యార్థులను రక్షించాడు. కాల్పులు శబ్ధాన్ని ఆలకించిన శ్రీధర్ తన తరగతి గదిలోని 20 మంది విద్యార్థులను బెంచీల కింద కూర్బోబెట్టి తలుపులు మూసేశారు. ఇలా 20 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడారు. ఈయన గత 20 యేళ్లుగా టాంగిల్ వుండే స్కూల్‌లో మ్యాథ్స్ టీచరుగా పని చేస్తున్నారు.