శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:34 IST)

"ఐస్ బకెట్ ఛాలెంజ్" స్ఫూర్తిప్రదాత ఆంటోని ఇకలేరు...

ALSicebucketchallenge ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఆంటోని సెనెర్చియా ఇక లేరు. అమ్యోట్రోఫిక్ లేటరల్ స్కెలోరొసిస్ అనే వ్యాధితో సుమారు 14 ఏళ్లుగా పోరాడి ఓడిపోయాడు. ఈ జబ్బు గురించి అవగాహన పెంచేందుకు, దీనిపై విరివిగా పరిశోధన జరిగాలని ప్రపంచానికి తెలియజెప్ప

ALSicebucketchallenge ద్వారా ప్రపంచానికి పరిచయమైన ఆంటోని సెనెర్చియా ఇక లేరు. అమ్యోట్రోఫిక్ లేటరల్ స్కెలోరొసిస్ అనే వ్యాధితో సుమారు 14 ఏళ్లుగా పోరాడి ఓడిపోయాడు. నవంబరు 28న కన్నుమూశాడు. ఈ జబ్బు గురించి అవగాహన పెంచేందుకు, దీనిపై విరివిగా పరిశోధన జరిగాలని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఆయన ఐస్ బకెట్ ఛాలెంజ్ ఎంచుకున్నారు. జబ్బు వచ్చినప్పుడు కుంగిపోకుండా దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలనీ, ఇతరులకు ఆ వ్యాధి పట్ల అవగాహన కల్గించాలని ఆంటోని చెప్పేవారు. 2003లో ఆయనకు ఈ వ్యాధి సోకింది. 
 
తన భర్త మరణం పట్ల ఆంటోని భార్య మాట్లాడుతూ... ఆయన భౌతికంగా దూరమైనా కోట్లమంది హృదయాల్లో బ్రతికే వున్నారన్నారు. ఆయన ఓ యోధుడు. మాకు దారి చూపించిన ఓ వెలుగు అని అన్నారు. కాగా ఆంటోని ఐస్ బకెట్ ఛాలెంజ్‌తో కేవలం 2 నెలల్లోనే 115 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. ఈ డబ్బునంతా పరిశోధనకు వినియోగించాలని ఆయన కోరాడు.