ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 30 నవంబరు 2017 (13:43 IST)

'డల్లాస్'లో ఇండియన్ బాలిక హత్య... తొడ ఎముక విరిగింది... అదే జరిగిందా?

ఒక అనాథాశ్రమం నుంచి బాలికను సాకుతామని తీసుకువచ్చి ఆమెను అత్యంత పైశాచికంగా హత్య చేసి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో డల్లాస్ లోని ఓ కల్వర్టు కింద పారవేసినట్లు ఓ జంట ఆరోపణలు ఎదుర్కొంటోంది. వివరాలను చూస్తే గత అక్టోబరు నెలలో మూడేళ్ల తమ పెంపుడు కుమార్తె షెరీన

ఒక అనాథాశ్రమం నుంచి బాలికను సాకుతామని తీసుకువచ్చి ఆమెను అత్యంత పైశాచికంగా హత్య చేసి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో డల్లాస్ లోని ఓ కల్వర్టు కింద పారవేసినట్లు ఓ జంట ఆరోపణలు ఎదుర్కొంటోంది. వివరాలను చూస్తే గత అక్టోబరు నెలలో మూడేళ్ల తమ పెంపుడు కుమార్తె షెరీన్ మాథ్యూస్ బాలిక తమకు కనిపించడంలేదంటూ అన్ మాథ్యూస్, ఆమె భర్త వెస్లీ మాథ్యూస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ భారత సంతతి(కేరళ)కి చెందినవారు. 
 
వంట గదిలో ఆమెను వదిలేసి తాము విధులకు వెళ్లామనీ, తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదని చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డల్లాస్ లోని ఓ కల్వర్టులో బాలిక మృత దేహాన్ని కనుగొన్నారు. బాలిక శవానికి పోస్టుమార్టం నిర్వహించగా అందులో బాలికపై దాడి జరిగినట్లు తేలింది. 
 
తొడ ఎముక, మోకాలి కింది ఎముక విరిగిపోయి వున్నాయి. ఇంకా శరీరంలో చాలాచోట్ల ఎముకలు విరిగిన ఆనవాళ్లు కనిపించాయి. దీనితో సదరు జంటను పోలీసులు విచారించగా వారు మాత్రం తాము బాలికను వంట గదిలో వదిలేసి వెళ్లామని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం బాలిక మృతికి వీరిద్దరే కారణమని అరెస్టు చేశారు. మరోవైపు పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై దాడి జరిగినట్లు వైద్యులు చెపుతున్నారు. ఐతే కోర్టులో ఈ జంట తరపున వాదనలు చేసిన న్యాయవాది బలమైన వాదన వినిపించారు. దీనితో కట్టాల్సిన జరిమానాలో తగ్గింపు చేశారు. అలాగే శిక్ష కూడా తగ్గే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.