శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 9 డిశెంబరు 2018 (11:36 IST)

వాట్సాప్‌లో తలాక్ చెప్పి అమెరికాకు చెక్కేసిన భర్త

అమెరికా నుంచి వాట్సాప్‌లో తలాక్ చెప్పేశాడో వ్యక్తి. వివాహ జీవితంలో వచ్చిన గొడవలను పరిష్కరించుకుందామని నమ్మించి భార్యకు వాట్సప్‌లో మూడు సార్లు తలాక్ చెప్పాడు. దీంతో మహిళా పోలీసులకు భాదిత మహిళ ఫిర్యాదు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరు‌కు చెందిన డాక్టర్‌ జావేద్‌ ఖాన్‌, రేష్మా అజీజ్‌లకు 2003లో వివాహమైంది. ఆ దంపతులు తొలుత ఇంగ్లండ్‌లో స్థిరపడ్డారు. ఆ తర్వాత అమెరికాకు మారారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 
 
దీంతో బెంగళూరులో పెద్దల ఎదుట పరిష్కరించుకుందామంటూ భార్యను నమ్మించి స్వదేశానికి వచ్చారు. నవంబర్ ‌30వ తేదీన వారు బెంగళూరుకు చేరుకున్నారు. విమానంలో ఉండగానే భార్య దగ్గర ఉన్న నగదును, బంగారాన్ని  జావేద్‌ తీసుకున్నాడు. వీటితో పాటే భార్య పాస్ పోర్టును కూడా లాగేసుకున్నాడు. 
 
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఇప్పుడే వస్తానంటూ చెప్పి భార్యను ఇంటికి పంపించి వేశాడు. ఎంతకీ తిరిగి రాకపోవడమేకాక ఈ నెల మొదటివారంలో భార్య మొబైల్ పోన్‌కు మూడుసార్లు తలాక్ అంటూ ఓ టెక్ట్స్ మెసేజ్‌తో పాటు వాయిస్ మెసేజ్ కూడా పంపాడు. రేష్మా ఇచ్చిన ఫిర్యాదు‌ను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.