ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (10:25 IST)

బీరు కొట్టు... యోగ పట్టు... ఉర్రూతలూగుతున్న కాంబోడియా యువత

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల మానసికంగా కుంగిపోయిన ప్రజలు ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వేళ కొత్తకొత్త సంతోషాలను వెతుక్కుంటున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో మిస్పయిన సంతోషాన్ని స్నేహితులతో కలిసి పొందుతున్నారు.

ఆసియా దేశం కాంబోడియాలో లాక్‌డౌన్‌ ఎత్తేసిన అనంతరం ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. యువత బీరు తాగుతూ యోగా చేస్తుండడం వాటిలో ముఖ్యమైనది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాంబోడియా ముఖ్యనగరం నామ్‌ ఫెన్‌లో యువతకు ఇప్పుడీ యోగా బీర్‌ బాగా ఉపశమనం కలిగిస్తోంది.

నలుగురితో కలిసి హాయిగా బీరు తాగుతూ, యోగా చేయడాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. ఈ తరహా యోగాను ప్రముఖ బీరు తయారీ సంస్థ టూబర్డ్స్‌ క్రాఫ్ట్‌ బీర్‌ బ్రూవరీ ప్రోత్సహిస్తోంది. బీరు యోగాతో తమకు ఎంతో వినోదం లభిస్తోందని స్రేలిన్‌ బచా అనే పాతికేళ్ల యువతి చెబుతోంది.

ఆసియాలో చిన్నదేశమైన కాంబోడియా కరోనాను అత్యంత సమర్థంగా కట్టడి చేసింది. ఇక్కడ ఇప్పటివరకు 456 కేసులు మాత్రమే నమోదు కాగా, 399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఈ దేశంలో కేవలం 6 వారాలు మాత్రమే లాక్‌డౌన్‌ విధించి ఆ తర్వాత సడలించారు.