మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (12:30 IST)

అమెరికాలో మహాత్మాగాంధీ సరసన జయలలిత... ఓ వీధికి జయలలిత పేరు...

స్వదేశంలో కోట్లాది మంది తమిళ ప్రజలు ముఖ్యమంత్రి జయలలితను అమ్మగా భావిస్తారు. మరికొందరు అవినీతికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. కానీ అమెరికన్స్‌ మాత్రం ఏకంగా ఒక వీధికి ఆమె పేరు పెట్టేశారు. షికాగోలోని బ్రాబ్

స్వదేశంలో కోట్లాది మంది తమిళ ప్రజలు ముఖ్యమంత్రి జయలలితను అమ్మగా భావిస్తారు. మరికొందరు అవినీతికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. కానీ అమెరికన్స్‌ మాత్రం ఏకంగా ఒక వీధికి ఆమె పేరు పెట్టేశారు. షికాగోలోని బ్రాబ్‌వే అవెన్యూ, డెవన్‌ అవెన్యూ, నార్త్‌ షెరిడాన్‌ వీధులు కలిసే చోట ఒక వీధికి 'డాక్టర్‌ జె.జయలలిత వే' అని నామకరణం చేశారు. 
 
వెస్ట్‌డెవన్‌ అవెన్యూలో జయలలితకు తోడుగా మహాత్మాగాంధీ, మహమ్మదాలీ జిన్నా, గోల్డామీర్‌ల పేర్ల మీద కూడా వీధులున్నాయి. జయలలిత నాయకత్వానికీ సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల ఆమెకున్న అంకిత భావానికీ గుర్తింపుగా ఈ గౌరవాన్నిస్తున్నట్లు అప్పటి ఇలినాయిస్‌ గవర్నర్‌ జిమ్‌ ఎడ్గర్‌ ప్రకటించారు.
 
ఇలినాయిస్‌ సెనేటర్‌ హోవర్డ్‌ డబ్లు్య కెరోల్‌ జయకు ఈ గుర్తింపు లభించడం వెనుక అసలు సూత్రధారి. తమిళనాడును ఆదర్శంగా తీసుకుని ఇలినాయిస్‌లో కూడా మహిళా పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేస్తామనీ మహిళా శిశు సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామనీ ఆయన చెప్పినట్టు సమాచారం.