మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 జూన్ 2021 (17:14 IST)

అగ్రరాజ్యం కాల్పుల కలకలం.. వృద్ధురాలు, ఏడాది పిల్లాడి మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. గురువారం రోజు తూట పేలడంతో ఓ మహిళతోపాటు ఏడాది బాబు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని రాయల్ పామ్ బీచ్‌లో ఉన్న పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్‌లో గురువారం రోజు ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో వృద్ధ మహిళ సహా ఏడాది వయసున్న ఆమె మనవడు తీవ్రంగా గాయపడ్డి ప్రాణాలు కోల్పోయారు. 
 
అనంతరం కాల్పులకు పాల్పడ్డ సదరు దుండగుడు సైతం తనను తాను కాల్చుకుని మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 
అంతేకాకుండా దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఫ్లోరిడాలో గత ఆదివారం కూడా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డ సంగతి తెలిసిందే. మియామిలోని జరిగే గ్రాడ్యూయేషన్ పార్టీలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గరు మరణించగా.. ఐదుగురు గాయపడిన సంగతి విదితమే.